
- ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ధీటుగా నిలబడె ఏకైక విద్య కేంద్రం.
- ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రాలు " హోప్ డైమండ్" (ఇప్పుడు National Musium of Natural History, Washington DC, USA లో ఉన్నది) మరియు కోహినూర్ వజ్రాలు మన గుంటూర్ జిల్లా నుండి లభించినవే
- మైకా (Mica) గా పిలవబడే అబ్రకము అను లోహమును సుమారు 2200 సంవత్సరాల క్రితం మన గుంటూరు ప్రాంతంలో కనుగొన్నారు. ఆది గొప్ప తత్వవేత్త ఐన ఆచార్య నాగార్జునుడి ద్వారా అని ఒక నమ్మకం.
- 1868 ఆగస్ట్ 18న "Pierve Jules Cesar Janssen (1824-1907) అను శాస్త్రవేత్త సంపూర్ణ సూర్యగ్రహణ స్థితిని గుంటూరు ప్రాంతం నుండి గమనించు సమయంలో అసాధారణ నిడివిగా 10 నిమిషాల పాటు సూర్యునిలో హీలియం ఉనికిని గమనించారు. ఈ విషయం ప్రపంచ శాస్త్రవేతల చూపును గుంటూరు వైపుకు మరలేలా చేసింది.
- మనందరికీ తెలిసిన "టైట్యానిక్" (Titanic Ship) లో ఉన్న ఏకైక భారతీయ కుటుంబం మన గుంటూరు నుండి వెళ్లినవారే.
- ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది.
- రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యాభ్యాసానికి నాంది పలికింది గుంటూరు.
- U.S. లోని గొప్ప వైద్యులు మన గుంటూరు మెడికల్ కళాశాల నుండి వెళ్లినవారే.
- ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి సుగంధ ద్రవ్యాల పార్క్ (Spices Park) మన గుంటూర్ జిల్లాలోనే నెలకొల్పబడింది.