Tuesday, 23 June 2015

రాధామాధవ రసరంజని జాతీయ స్థాయి సంగీత నృత్య పోటీలకు విచ్చేసిన శ్రీమతి శోభా నాయుడు గారు రాధామాధవ గురించి తమ మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 


రాధామాధవ రసరంజని 
కళాకారులు కళాప్రియులు సంస్కృతికి సంరక్షకులు. 
లలిత కళలు సమాజ అభ్యున్నతికి సంకేతాలు.
అది 1996వ సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేది
పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి
కర కమలాలలో నుంచి ఉదయించింది రసరంజని
ఆబాల గోపాలాన్ని అలరించి మురిపించి అయింది జనరంజని
ప్రతి నెలా మొదటి ఆదివారం కళల వెన్నెల కాయిస్తుంది. 
ఎదల పొదలలో ఆనందపు పూలు ఎన్నెన్నొ పూయిస్తుంది. 
నృత్యానికి, సంగీతానికి అగ్రతాంబూలం ఇస్తుంది.
మిమిక్రీని, మ్యాజిక్ని కామెడీ స్కిట్స్ని చేరదీస్తుంది.
నిస్వార్ధంగా నిరంతరంగా ముందుకు సాగుతుంది
ప్రతి రెండేళ్లకి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుంది
స్వరాష్ట్రంలోనూ పర రాష్ట్రాలలోనూ ఉన్న నర్తకీ నర్తకులు, 
ప్రదర్శిస్తారు పలురకాల ప్రతిభామయ నర్తనలు.
అప్పుడప్పుడు అఖిల ప్రపంచపు కళాకారులు వస్తారు.
కార్యక్రమాలలో పాల్గొని అందరికి కనువిందు కావిస్తారు
రసరంజని ఐకమత్యానికి అభ్యుడయానికి అసలైన ప్రతీక
ఎగురవేస్తుంది ఎదురులేని విధంగా సిసలైన కీర్తి పతాక.​

Thursday, 11 June 2015

226వ నెల నెలా వెన్నెల - 07-06-2015 ఫోటోలు

రాధామాధవ రసరంజని 226 వ నెల నెలా వెన్నెల కార్యక్రమ ప్రారంభాకులు: 
శ్రీ కస్తూరి సత్యనారాయణ గారు







రాధామాధవ విద్యార్ధుల కూచిపూడి నృత్యాలు




చిన్నారుల నృత్యాలను వీక్షిస్తున్న ప్రేక్షకులు మరియు రాధామాధవ సభ్యులు


















ఈనాటి ముఖ్య అతిధి మరియు సన్మాన గ్రహీత ఐన శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారికి పాదాభివందనం చేస్తున్న శ్రీ ఖలీల్ గారు



గురువు ఔన్నత్యాన్ని విద్యార్ధి లక్షణాలను ప్రక్షకులకు వివరిస్తున్న మన కమిటీ సభ్యులు శ్రీ దుర్గ ప్రసాద్ గారు


 శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారిని సన్మనిస్తున్న శ్రీ కోటపాటి సాంబయ్య గారు వారి ధర్మపత్ని


కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత తాను గుంటూరు లో ఉన్నానా లేక కూచిపూడి లో ఉన్నానా అనే సన్ధిగ్ధమ్లో ఖలీల్ గారు పడేశారని తన మనసులోని మాటను తెలియజేస్తూ గుంటూరుకు ఖలీల్ ఒక వరమని తన కృషికి తప్పకుండా చక్కని గుర్తింపు ప్రభుత్వం నుంచి లభిస్తుందని ఆకాంక్షించిన శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారు









ప్రేక్షకులతో కలసి చిన్నారుల నృత్యాలను తిలకిస్తున్న శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారు







ఆపాత మాధురాలతో పాటు కొత్త చిత్రాలలోని చక్కని గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీమతి హెలెన్ కుమారి గారు మరియు శ్రీ రసూల్ గారు




Thank you All......!