Tuesday, 23 June 2015

రాధామాధవ రసరంజని 
కళాకారులు కళాప్రియులు సంస్కృతికి సంరక్షకులు. 
లలిత కళలు సమాజ అభ్యున్నతికి సంకేతాలు.
అది 1996వ సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేది
పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి
కర కమలాలలో నుంచి ఉదయించింది రసరంజని
ఆబాల గోపాలాన్ని అలరించి మురిపించి అయింది జనరంజని
ప్రతి నెలా మొదటి ఆదివారం కళల వెన్నెల కాయిస్తుంది. 
ఎదల పొదలలో ఆనందపు పూలు ఎన్నెన్నొ పూయిస్తుంది. 
నృత్యానికి, సంగీతానికి అగ్రతాంబూలం ఇస్తుంది.
మిమిక్రీని, మ్యాజిక్ని కామెడీ స్కిట్స్ని చేరదీస్తుంది.
నిస్వార్ధంగా నిరంతరంగా ముందుకు సాగుతుంది
ప్రతి రెండేళ్లకి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుంది
స్వరాష్ట్రంలోనూ పర రాష్ట్రాలలోనూ ఉన్న నర్తకీ నర్తకులు, 
ప్రదర్శిస్తారు పలురకాల ప్రతిభామయ నర్తనలు.
అప్పుడప్పుడు అఖిల ప్రపంచపు కళాకారులు వస్తారు.
కార్యక్రమాలలో పాల్గొని అందరికి కనువిందు కావిస్తారు
రసరంజని ఐకమత్యానికి అభ్యుడయానికి అసలైన ప్రతీక
ఎగురవేస్తుంది ఎదురులేని విధంగా సిసలైన కీర్తి పతాక.​

No comments:

Post a Comment